: ఒబా'మా' భారతీయం


మరోసారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పట్ల తన అభిమానాన్ని, భారతీయుల ప్రతిభ పట్ల నమ్మకాన్ని చాటుకున్నారు. అమెరికా రాజకీయ, సైనిక వ్యవహారాల సహాయ మంత్రిగా భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ ను నియమిస్తూ ఒబామా లోగడ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ తాజాగా ఆమోదం తెలిపింది.

ఇప్పటి వరకు తల్వార్ మిడిల్ ఈస్ట్ ప్రాంత వ్యవహారాల్లో ఒబామాకు సహాయకులుగా ఉన్నారు. అగ్రరాజ్యం తరపున తల్వార్ ఇరాక్ తో గతంలో కీలక చర్చలు జరిపారు. అమెరికా సహాయ మంత్రి పదవికి ఎంపికైన రెండో వ్యక్తి తల్వార్. ఇప్పటికే నిషాదేశాయ్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల్లో అమెరికా సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. జడ్జిలు సహా ఎన్నో కీలక పదవులను ఒబామా తన పదవీ కాలంలో భారతీయులకు కట్టబెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News