: సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీ అయిన అళగిరి
తండ్రి ఆగ్రహంతో డీఎంకే నుంచి బహిష్కృతుడైన కరుణానిధి కుమారుడు ఎం.కె.అళగిరి(63)... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఈ ఉదయం చెన్నైలో భేటీ అయ్యారు. అయితే వీరి సమావేశానికి గల కారణాలు వెల్లడవలేదు. పొత్తుల విషయంలో కరుణానిధితో విభేదించడం వల్ల అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అళగిరి ఆ తర్వాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అళగిరితో రజనీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.