: మరో వెయ్యేళ్లైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది... అవి ఎన్నికల పార్టీలే: రఘువీరా


గత 127 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏకఛత్రాధిపత్యం వహించిందని, మరో వెయ్యేళ్లైనా కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంటుందని మాజీ మంత్రి, సీమాంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల పార్టీలని అన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆ పార్టీలన్నీ ఏదో ఒక పార్టీలో విలీనం కావాల్సిందేనని ఆయన చెప్పారు. అందుచేతనే కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలంతా మళ్లీ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News