: ఈ సారి గెలుస్తాం... పాక్ మ్యాచ్ పై కోహ్లీ


టీట్వంటీ వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి బంగ్లాదేశ్ వేదికగా పొట్టి ఫార్మాట్ ఆట కనువిందు చేయనుంది. 21వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడనుంది. ఆసియా కప్ లో పాక్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా టీట్వంటీ మ్యాచ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇదే వేదికపై పరాభవం చవిచూసిన టీమిండియాకు ఇక్కడి పరిస్థితులు లాభిస్తాయనే ఆశిస్తున్నానని ట్విట్టర్లో కోహ్లీ పేర్కొన్నాడు. ఆసియా కప్ తరువాత టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతి లభించిందని, టీట్వంటీలో విజ్రుంభించేందుకు అది పనికొస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ సారి పాక్ పై గెలుస్తామని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News