: ఇంటర్ ప్రధమ, ద్వితీయ తెలుగు ప్రశ్నాపత్రాల్లో తప్పులు


ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాతృ భాషను కష్టాల్లోకి నెడుతోంది. టెక్స్ట్ పుస్తకాల్లోనే అచ్చుతప్పులు ముద్రించే జాఢ్యం పరీక్షల్లో ప్రశ్నాపత్రాలకు కూడా పాకింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం తెలుగు ప్రశ్నాపత్రంలో అచ్చుతప్పులు దొర్లాయి. విషయం వార్తా పత్రికల ద్వారా అందరికీ తెలిసింది. అయినప్పటికీ ద్వితీయ సంవత్సరం తెలుగు ప్రశ్నాపత్రాల్లో దొర్లిన అచ్చుతప్పులను సరిదిద్దేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో రెండు అచ్చుతప్పుల వల్ల విద్యార్థులు విలువైన రెండు మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. రెండో ఏడాది తెలుగు ప్రశ్నాపత్రంలో 15వ ప్రశ్న 'పడిపోతున్న అడ్డుగోడలు' అని ఉండాల్సిన చోట 'పడిపోయిన అడ్డుగోడలు' అని ఉండగా, 'తిక్కన రాసిన పర్వాలెన్ని' అని ఉండాల్సిన చోట 'తిక్కన రాసిన పద్యాలెన్ని' అని పడింది. దీంతో విద్యార్థులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దీంతో 'అధికారుల నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల రెండు మార్కులు' అని లెక్చరర్లు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News