: ఐపీఎస్ భార్యను వేధించిన ఆకతాయిలు
ఆకతాయిల ఆగడాలకు అడ్డూఆపూ ఉండదు. తాజాగా నలుగురు ఆకతాయిలు ఓ మాల్ లో షాపింగ్ చేసుకుంటున్న ఐపీఎస్ అధికారి భార్యను వేధించి కటకటాలపాలయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ లో సీబీసీఐడీ అధికారి భార్య షాపింగ్ చేసుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు ఆకతాయిలు ఆమె వెంటపడి వేధించడం మొదలు పెట్టారు.
వారి వెకిలి వేషాలు భరించలేని ఆమె, పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి తన వివరాలు చెప్పి, ఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారి భార్య ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాలమీద స్పందించిన పోలీసులు సీసీటీవీ పుటేజ్ చూసి అకిల్ అహ్మద్, ఇర్షాద్ ఆహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ లను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.