: జై సమైక్యాంధ్ర విధివిధానాలను త్వరలో ప్రకటిస్తాం: కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని, ప్రజల నాడిని బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. నిన్న రాజమండ్రిలోని జెమినీ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగిన పార్టీ తొలి బహిరంగ సభ విజయవంతమైందన్న కిరణ్, సమైక్యవాదానికున్న బలమేంటో సభ ద్వారా తెలిసిందన్నారు.