: అమెరికాలో టాప్ సీఈవోలలో ఇద్దరు భారతీయలు
అమెరికాలో మరో ఇద్దరు భారతీయులు మాతృ దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఫోర్బ్స్ 40 ఏళ్లలోపు అత్యంత శక్తిమంతమైన అమెరికా సీఈవో (కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు)ల జాబితా విడుదల చేయగా, అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు. వీరు పనిచేసే కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ ఈ అంచనాకొచ్చింది. ఎండ్యూరన్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈవో హరి కె రవిచంద్రన్ 19వ స్థానంలో ఉండగా, ఆల్టిసోర్స్ అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ సీఈవో ఆశిష్ పాండే 20వ స్థానంలో నిలిచారు.