: టీడీపీ నేతలకు క్లాస్ పీకిన నాగం
విద్యుత్ సమస్యపై శాసనసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేకపోయారని మాజీ టీడీపీ నేత, తెలంగాణ నగారా అధ్యక్షుడు నాగం జనార్థన రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తుచేశారు.
ఎన్ని అడ్డంకులెదురైనా నాణ్యమైన కరెంట్ ను ప్రజలకు అందించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పి, సర్కారును ఇరుకున పెట్టలేకపోయారంటూ నాగం టీడీపీ నేతలకు శాసనసభ లాబీలో చురకలంటించారు. తెలంగాణ అంశంపై విభేదిస్తూ నాగం తెలుగుదేశం పార్టీని వీడిన సంగతి విదితమే.