: లైంగిక ఆరోపణల నేపథ్యంలో సమాచార శాఖ ఉద్యోగి అరెస్ట్
ఓ ఉద్యోగినిని లైంగికంగా వేధించారనే కేసులో విజయవాడ సమాచార శాఖ ఉద్యోగి వేమూరి ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా ఉద్యోగి ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.