: బీజేపీ పొత్తులపై శివసేన అసంతృప్తి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి వలస వస్తున్న ప్రతి ఒక్కరినీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుండటంపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ పత్రిక 'సామ్నా'లో మండిపడింది. ప్రధానంగా ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) ను చేర్చుకోవడంపై శివసేన గుర్రుగా ఉంది. కొత్త మిత్రుల కోసం పాతవారిని వదులుకుంటారా? అని ప్రశ్నించింది. కొత్త పొత్తులు పెట్టుకునేముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని సూచించింది. లేదంటే ఎన్డీఏకు గడ్డుకాలం తప్పదని శివసేన హెచ్చరించింది. చౌతాలా, పురంధేశ్వరిలను పార్టీలో చేర్చుకునేముందు అక్కడి మిత్రులను ఎందుకు సంప్రదించలేదు? అని సూటిగా నిలదీసింది.