: కాంగ్రెస్ ను కేసీఆర్ ముంచేశారు: కిరణ్
కిరణ్ మోసం చేశాడని జైరాం రమేష్ అంటున్నారని... ఆయనొక పిచ్చి మేధావని కిరణ్ ఎద్దేవా చేశారు. నిజంగా మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీలు అని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన మరుసటి రోజు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి... బిల్లులో మార్పులు చేసి ఆర్డినెన్సులు తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందుకంత తహతహలాడిపోయారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కిరణ్ నిలదీశారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ముంచేశారని ఎద్దేవా చేశారు. ఇంకా రాష్ట్రం విడిపోలేదని... జరగాల్సింది చాలా ఉందని కిరణ్ చెప్పారు.