: నర్గీస్ ఫక్రీకి హాలీవుడ్ చాన్స్
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అందాల భామ నర్గీస్ ఫక్రీ హాలీవుడ్ ఛాన్స్ దక్కించుకుంది. పాల్ ఫెయిగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈ సుందరి సెక్సీ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతుంది. ఫాక్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో 'ట్రాన్స్ పోర్టర్' ఫేమ్ నటుడు జాసన్ స్టాథమ్ నటిస్తున్నాడు. 'రాక్ స్టార్' చిత్రంతో హిందీకి పరిచయమైన నర్గీస్ 'మద్రాస్ కేఫ్', 'మే తేరా హీరో' సినిమాల్లో నటించింది.