: అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న అమితాబ్
సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో తన పనులన్నింటికీ విరామం తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల కిందట నొప్పి కారణంగా ఈ నెల 10న ముంబైలోని ఓ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకున్నాడట. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దాంతో, తన సినిమాల షెడ్యూల్, ప్రకటనల చిత్రీకరణ, పలు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దీని గురించే ట్విట్టర్ లో చెబుతూ 'సిటీ స్కాన్ లో చాలా క్లియర్ గా బాగానే ఉంది. కానీ, ఇంకా నొప్పి వస్తూనే ఉంది. డాక్టర్లు మందులు ఇచ్చారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఇదే అందరికీ చెబుతున్నాను' అని బిగ్ బీ తెలిపారు.