: ఆంధ్రప్రదేశ్ విభజనపై మమత ఘాటు వ్యాఖ్యలు


ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని మండిపడ్డారు. ఎవరినడిగి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని నిలదీశారు. ఇంతజేసిన వాళ్ళు దేశాన్ని కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. నేడు ఢిల్లీలోని రమిల్లా మైదాన్ లో జరిగిన సభలో ఆమె తన పార్టీ జాతీయ అజెండాను విడుదల చేశారు.

మమత బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోడీ పేరెత్తకుండా, గుజరాత్ నేత మతతత్వ వాది అని ఆరోపించారు. కాగా, ఈ ర్యాలీకి అన్నా హజారే వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆయన హాజరుకాలేదు. దీనిపై మమత స్పందిస్తూ, ఎవరు వచ్చినా రాకున్నా, మద్దతిచ్చినా ఇవ్వకున్నా ఢిల్లీని కుదిపేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News