: ఫేస్ బుక్ లో పేపర్ లీకైంది!


సామాజిక, వ్యక్తిగత అంశాలు పంచుకోవడానికి ప్రముఖమైన వేదికగా నిలుస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ను అసాంఘిక చర్యలకూ ఉపయోగిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. మణిపూర్లో ఏకంగా సీబీఎస్ఈ ప్లస్ టు ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్నే ఫేస్ బుక్ లో పెట్టేశారు. పరీక్షల ఆరంభానికి ఒకరోజు ముందే సదరు పేపర్ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైంది. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. తాము రాత్రింబవళ్ళు చదవి పరీక్ష రాశామని కొందరు విద్యార్థులు వాపోయారు. పరీక్ష మరోసారి నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు.

కాగా, మణిపూర్లోని అన్ని పాఠశాలల్లో రీ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, మధ్యప్రదేశ్ లోని సీబీఎస్ఈ పాఠశాలలు ఇంకా ఏ నిర్ణయం వెలిబుచ్చలేదు. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఎస్ఈ బోర్డు మధ్యప్రదేశ్ పాఠశాలలను కోరింది.

  • Loading...

More Telugu News