: విమానం అదృశ్యంపై ఇంటర్ పోల్ తో విభేదిస్తున్న సీఐఏ


మలేసియా జెట్ విమానం కనిపించకుండా పోయిన ఘటనలో ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) అభిప్రాయపడింది. సీఐఏ డైరక్టర్ జాన్ బ్రెనాన్ వాషింగ్టన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, విమానం అదృశ్యం మిస్టరీగానే ఉందన్నారు. ఈ ఘటనపై ఏ అనుమానాన్నీ కొట్టిపారేయలేమన్నారు. కాగా, ఇంటర్ పోల్ చీఫ్ రొనాల్డ్ నోబుల్ నిన్న ఫ్రాన్స్ లో మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో ఉగ్రవాదుల హస్తం ఉందని తాము భావించడంలేదని పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News