: ఒబామా షాపింగ్ చేస్తే...!
సామాన్యుడైనా, మాన్యుడైనా పెళ్ళంటూ చేసుకున్నాక భార్యాబిడ్డల ఇష్టాయిష్టాలకూ ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. అది అమెరికా అధ్యక్షుడైనా సరే. తాజాగా ఆయన నిధుల సేకరణ కార్యక్రమం కోసం న్యూయార్క్ వచ్చారు. ఈలోపు కాస్త వెసులుబాటు దొరకడంతో ప్రఖ్యాత 'గ్యాప్' బ్రాండెడ్ దుస్తుల దుకాణంలో షాపింగ్ చేశారు. అర్ధాంగి మిచెల్లీ ఒబామాకు నీలి రంగు మీడియం సైజ్ అథ్లెటిక్ జాకెట్, కుమార్తెలు సాషా, మలియా కోసం రెగ్యులర్ కట్ నెక్ లాంగ్ స్లీవ్ స్వెటర్లు కొనుగోలు చేశారు. 'వి' నెక్ అయితే కిందికి జారిపోయే ప్రమాదం ఉందని, అందుకే కట్ నెక్ స్వెటర్లు తీసుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా సెలెక్షన్ కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నా' అని పేర్కొన్నారు.