: మహిళలు యుద్ధవిమానాలు నడపడానికి సరిపడరు: వాయుసేనాధిపతి
యుద్ధ విమానాలు నడపడానికి మహిళలు శారీరకంగా సరపడరని వాయుసేనాధిపతి అరూప్ రాహా అన్నారు. యుద్ధ విమానాలను నడిపే సమయాల్లో వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చైనా, పాకిస్థాన్ దేశాల్లోని వాయుసేన విభాగాల్లో యుద్ధ విమానాలు నడిపేందుకు మహిళలను అనుమతిస్తుండగా.. మన దగ్గర ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు అడగ్గా రాహా పై విధంగా బదులిచ్చారు. 'యుద్ధ విమానాలు నడపడం ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగం. మహిళలు ఎక్కువ గంటలపాటు యుద్ధ విమానాలను నడపలేరు. ముఖ్యంగా గర్భం, ఇతర సమస్యలు ఇందుకు కారణం' అని ఆయన వివరించారు. వాయుసేనలోని ఇతర విభాగాల్లో మహిళలు చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.