: శాసనసభ రేపటికి వాయిదా
విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నిరాకరించడంతో ఈ ఉదయం శాసనసభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదాపడిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రారంభమైన సభలో విద్యుత్ అంశం కీలక భూమిక పోషించింది. విద్యుత్ సమస్య పై స్వల్పకాలిక చర్చ జరిగిన అనంతరం ఉప సభాపతి శాసనసభను రేపటికి వాయిదా వేశారు. విద్యుత్ సమస్యమీద చర్చ రేపు కూడా కొనసాగుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.