: సుస్థిర పాలన అందించే పార్టీనే ఎన్నుకోవాలి: అరుణ్ జైట్లీ
గత ఎన్నికలకు, 2014 ఎన్నికలకు తేడా ఉందని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నాయని అన్నారు. దేశానికి ఎవరు సరైన పాలన అందిస్తారనేదే ఈ ఎన్నికల్లో కీలకమని చెప్పారు. సుస్థిర పాలన అందించే పార్టీనే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ఎన్డీఏ హయాంలో 8.5 శాతం వృద్ధి రేటు ఉంటే... యూపీఏ హయంలో అది 4.5 శాతానికి దిగజారిందని తెలిపారు. హైదరాబాదులో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే హయాంలో జరిగిన అభివృద్ధి కొనసాగి ఉంటే ఈ పాటికి చైనా సరసన భారత్ ఉండేదని విమర్శించారు.