: రెండో పెళ్లికి భార్య అంగీకారం అక్కర్లేదు!
భర్త రెండో పెళ్లికి మొదటి భార్య అంగీకారం అవసరం లేదని పాకిస్థాన్ దేశానికి చెందిన ది కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) చేసిన సూచనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి భార్య అంగీకారంతో, ఆమె సమక్షంలోనే భర్త రెండో పెళ్లి చేసుకోవాలన్న పాకిస్థాన్ ప్రభుత్వ చట్టం మత నియమాలకు విరుద్ధమని సీఐఐ అధ్యక్షుడు మౌలానా మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని సవరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
భర్త రెండో వివాహానికి మొదటి భార్య అంగీకారం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రెండో పెళ్లికి మొదటి భార్య ఆమోదం కచ్చితంగా కావాలని 1961 నాటి ముస్లిం కుటుంబ చట్టం చెబుతోంది. ఇది ఇస్లామిక్ షరియా చట్టానికి విరుద్ధంగా ఉందని మౌలానా పేర్కొన్నారు. ఆయన సూచనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.