: కారు పైనే సభావేదికను సిద్ధం చేసిన ‘సుధాకార్స్’
ఇంతకు ముందు వినూత్నంగా బుల్లి కార్లను రూపొందించిన హైదరాబాద్ కు చెందిన సుధాకర్ తాజాగా మొబైల్ స్టేజ్ వాహనాన్ని రూపొందించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా... అందరికీ ఉపయోగపడేలా సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న మొబైల్ స్టేజ్ వాహనాన్ని ఆయన తయారుచేశారు. ఎలాంటి వెల్డింగ్ లు లేకుండా అప్పటికప్పుడే ఫిట్ చేసుకుని, కార్యక్రమం అనంతరం తొలగించుకునే వెసులుబాటును కల్పించారు. టాటా జినాన్ పికప్ వ్యాన్ ను ఈ విధంగా తయారుచేసి బహదూర్ పురాలోని సుధాకార్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా సుధాకర్ మీడియాతో మాట్లాడారు. పబ్లిక్, కార్నర్ మీటింగ్స్ జరిగేటప్పుడు ఈ స్టేజ్ పై సుమారు 12 మంది వరకు నిలబడి సభలో పాల్గొనడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. వివిధ పార్టీలకు అవసరమైన రీతిలో మొబైల్ స్టేజ్ లో మార్పులు సైతం చేయనున్నట్లు ఆయన తెలిపారు.