: కూరలో టమోటాలు వేయలేదని భార్యను చంపాడు!


క్షణికావేశం కారణంగా ఓ నిండుప్రాణం బలైపోయింది. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ సమీప గ్రామం లాచ్మన్ లో జరిగిందీ దారుణం. కూరలో టమోటాలు వేయలేదని ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. వాచ్ మన్ గా పనిచేసే ఈ కిరాతకుడు భోజనానికి ఉపక్రమించగా భార్య తాను వండిన కూర తెచ్చి వడ్డించింది. అయితే, అందులో టమోటాలు లేకపోవడం గమనించిన ఆ కసాయి భర్త ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో, ఆమె ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News