: అనంతపురం వైఎస్సార్సీపీలో అసంతృప్తి


అనంతపురం వైఎస్సార్సీపీలో అసంతృప్తి బహిర్గతమయింది. అనంతపురం కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరడంతో... అనంతపురం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. మొదట్నుంచి అనంత వెంకట్రామిరెడ్డితో పొసగని గుర్నాథ రెడ్డి... వెంకట్రామిరెడ్డి పార్టీలో చేరడంతో సహించలేకపోతున్నారు. తమ వైరి వర్గాలను పార్టీలో చేర్చుకోవడంతో... పార్టీకీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. దీంతో జిల్లాలో వైకాపా నిలువునా చీలే పరిస్థితి దాపురించింది. దీనికి సంబంధించి ఇప్పటికే తన అభిమానులు, కార్యకర్తలతో గురునాథ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించారు.

  • Loading...

More Telugu News