: హెలికాప్టర్ల ఒప్పందంలో అవినీతి జరిగింది: ఆంటోని
సంచలనం సృష్టించిన 'అగస్టా వెస్ట్ లాండ్'
హెలికాప్టర్ల ఒప్పందంలో
అవినీతి జరిగిందని రక్షణ శాఖ మంత్రి ఏకె ఆంటోని
ధ్రువీకరించారు. త్వరలో రక్షణ కొనుగోళ్ళకు సంబంధించినూతన
విధానం
ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.
సోమవారం కేరళలోని కొచ్చిలో విలేకరులతో
మాట్లాడిన ఆంటోని..
"హెలికాప్టర్ ఒప్పందంలో
అవినీతి జరిగింది.
ముడుపులు కూడా
చేతులు మారాయి. ఈ కేసు
లో సీబీఐ చాలా ముమ్మరంగా పరిశోధన సాగిస్తోంది
" అని
పేర్కొన్నారు.
కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు మరి
కొంత సమయం పడుతుందన్నారు.
ఈ వ్యవహారంలో సంబంధం
ఉన్న
అందరిపైనా
తప్పకుండా
కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.