: అమ్మకానికి ఐన్ స్టీన్ ఉత్తరం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గురించి తెలియని వారెవరుంటారు. ఆయన ప్రతిపాదించిన పలు సిద్ధాంతాలు నేటికీ పరిశోధనా రంగంలో ప్రామాణికంగా కొనసాగుతున్నాయి. కాగా, ఆయన 1945లో ఓ అమెరికా సైనికుడికి రాసిన లేఖ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దాంట్లో రోదసిపై పలు విషయాలు పేర్కొన్నారు. సార్జెంట్ ఫ్రాంక్ కె ఫ్లీగోర్ కు ప్రత్యుత్తరంగా ఈ లేఖను రాశారు. తాజాగా ఈ లేఖను పెన్సిల్వేనియాకు చెందిన రాబ్ కలెక్షన్స్ అనే సంస్థ అమ్మకానికి పెట్టింది. ఓ సైన్స్ జర్నల్ లో వచ్చిన వ్యాసం అర్థం కావడంలేదని, దానిపై సందేహాలు తీర్చాలని సార్జెంట్ ఫ్రాంక్ తన మిత్రులతో కలిసి ఐన్ స్టీన్ కు ఉత్తరం రాయగా, ఆయన వెంటనే ప్రతిస్పందించి ఈ లేఖ రాశారు.