: కిరణ్ కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర’
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను పెట్టబోయే పార్టీ పేరును ప్రకటించారు. దీని పేరు ‘జై సమైక్యాంధ్ర’. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కొత్త పార్టీ ముందుకొస్తోందని కిరణ్ వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాట వినలేదని ఆయన చెప్పారు. పార్టీతో విభేదించే తాను బయటకు వచ్చానని కిరణ్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని కిరణ్ చెప్పారు. రాష్ట్ర విభజన ద్వారా తెలుగు ప్రజలకు అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆయన అన్నారు. బాబు అభిప్రాయాలను అసెంబ్లీలో కూడా స్పష్టంగా చెప్పలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై తాము సుప్రీంకోర్టులో కేసు వేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.