: బొగ్గు కుంభకోణంలో సీబీఐ తొలి ఛార్జిషీటు


సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపు కేసులో సీబీఐ ఇవాళ (సోమవారం) ఢిల్లీ కోర్టులో తొలి ఛార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు త్రివిక్రమ్ ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్ లను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి మధు జైన్ వద్ద ఛార్జిషీటును దాఖలు చేసింది.

2006-2009 సంవత్సరాల మధ్య బొగ్గు గనుల కేటాయింపు కోసం సమర్పించిన దరఖాస్తుల్లో వీరు వాస్తవాలు వక్రీకరించారని, మోసానికి పాల్పడ్డారని ఐపీసీ సెక్షన్లు 120-బి, 420 ప్రకారం కేసు పెట్టారు. ఇందుకు సంబంధించిన మరికొన్ని పత్రాలు, అనుబంధ పత్రాలను త్వరలో న్యాయస్థానానికి అందజేయనున్నారు.

2012 సెప్టెంబరులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్ల పేర్లను ఎక్కించింది. వీరితో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ, జార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు, ఇతరుల పేర్లు ఎక్కాయి. బొగ్గు గనుల కేటాయింపు తరువాత, నవభారత్ పవర్ ప్రమోటర్లు, వాటాదారులు తమ మొత్తం వాటాలను జూలై 2010లో ఎస్సార్ పవర్ లిమిటెడ్, దాని సబ్సిడరీకి రూ. 200 కోట్ల భారీ లాభానికి విక్రయించినట్టు సీబీఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News