: దమ్ముంటే చిత్తూరులో సభ నిర్వహించాలి: కిరణ్ కు వీహెచ్ సవాల్
కిరణ్ కు దమ్ముంటే చిత్తూరులో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో తాను అంబర్ పేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు మనసులోని మాటను బహిర్గతం చేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నెల 19న అంబర్ పేటలోని అమరవీరుల కుటుంబాలతో కలసి వారి సమస్యలను తెలుసుకుంటానని... కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాటిని పొందుపరుస్తామని వీహెచ్ తెలిపారు.