: ఎంపీ సీటుకు రూ. 60 కోట్లు అడిగారనేది అవాస్తవం: కోనేరు ప్రసాద్
తనకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పిలిచి టెకెట్ ఇచ్చారని కోనేరు ప్రసాద్ మీడియాకు తెలిపారు. సీటు కోసం రూ. 60 కోట్లు అడిగారనేది అవాస్తవమని చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీ కేసు సుప్రీంకోర్టులో ఉందని... కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం మడమ తిప్పని పోరాటం చేసింది జగన్ మాత్రమే అని చెప్పారు. వైఎస్సార్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కోనేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.