: రక్త పరీక్షతో అల్జీమర్స్ ముప్పు పసిగట్టవచ్చట!


వృద్ధాప్యంలో వేధించే వ్యాధుల్లో అల్జీమర్స్ ప్రధానమైనది. ఈ వ్యాధిని ముందే పసిగట్టేందుకని పరిశోధకులు ఓ కొత్త పరీక్ష విధానానికి రూపకల్పన చేశారు. ఈ ప్రొటో టైప్ రక్తపరీక్ష ద్వారా 90 శాతం కచ్చితత్వంతో అల్జీమర్స్ ముప్పును అంచనా వేయొచ్చని అమెరికా పరిశోధకులంటున్నారు. ఓ వ్యక్తి మూడేళ్ళలో ఈ వ్యాధి బారినపడే అవకాశాలున్నాయో లేవో చెప్పొచ్చని వారు 'నేచర్ మెడిసిన్ జర్నల్'లో ప్రచురితమైన తమ వ్యాసంలో పేర్కొన్నారు. 70 ఏళ్ళకు పైబడిన 525 మంది వృద్ధుల రక్త నమూనాలను పరిశీలించిన పిదప ఈ వివరాలు వెల్లడించారు. విషతుల్యమైన ప్రొటీన్ల కారణంగా ఉత్పన్నమయ్యే అల్జీమర్స్ మనిషి మెదడులోని కణాలను నాశనం చేస్తుంది. తద్వారా మనిషి జ్ఞాపకశక్తి నశిస్తుంది.

  • Loading...

More Telugu News