: పవార్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ఎన్నికల సభలో పాల్గొనేందుకు ఆయన ఉస్మానాబాద్ నుంచి పర్భని వెళుతుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురుకావడంతో హెలికాప్టర్ ను మధ్యలోనే కిందికి దింపాల్సి వచ్చింది. అంబేజోగాయ్ వద్ద ఎస్ఆర్టీ మెడికల్ కళాశాల మైదానంలో పవార్ హెలికాప్టర్ ను సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.