: ఫ్లెచర్ ను సాగనంపండి: గవాస్కర్
టీమిండియా దారుణ పరాజయాల నేపథ్యంలో కోచ్ డంకన్ ఫ్లెచర్ ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నూతనోత్సాహం పొంగిపొర్లే యువ కోచ్ ను భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా నియమించాలని సూచించారు. 65 ఏళ్ళ ఫ్లెచర్ పై తన వ్యాసంలో సునిశిత వ్యాఖ్యలు చేసిన సన్నీ, గతకొద్ది కాలంగా భారత ఆటగాళ్ళు సామాన్య క్రికెటర్ల మాదిరి కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దశలో భారత్ కు కావాల్సింది ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని యువ కోచ్ అని స్పష్టం చేశారు.