: మహిళల కోసం ముంబైలో ఎస్ఎంఎస్ హెల్ప్ లైన్
ముంబై మహానగరంలో మహిళల భద్రత కోసం పోలీసులు ఎస్ఎంఎస్ హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఎవరైనా మహిళ ఒంటరిగా ఆటోలో వెళ్లాల్సి వస్తే.. ఆటో ఎక్కే ముందు వాహనం నంబర్ ను హెల్ప్ లైన్ నంబర్ (9969777888)కు ఎస్ఎంఎస్ చేయాలి. అనంతరం జీపీఎస్ టెక్నాలజీ ద్వారా పోలీసులు ఆ వాహనంపై నిఘా వేసి ఉంచుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సేవను ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా శనివారం ప్రారంభించారు. ఈ నంబర్ కు చేసే ఎస్ఎంఎస్ కు చార్జ్ పడదు. ఈ సేవ ద్వారా మహిళల పట్ల జరగకూడదనిది ఏదైనా జరిగితే గుర్తించడం సులభం అవుతుందని మారియా చెప్పారు.