: భద్రతా దళాల రవాణాకు 100కుపైగా రైళ్లు
దేశవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్ల కోసం పారామిలటరీ దళాలను తరలించేందుకు కేంద్ర హోంశాఖ 100కు పైగా రైళ్లను అద్దెకు తీసుకోనుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి త్వరగా తరలించేందుకు రైళ్లను అనువైనవిగా భావిస్తోంది. ఏప్రిల్ 7 నుంచి జరగనున్న ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతోపాటు... సుమారుగా రెండు లక్షల మంది పారా మిలటరీ పోలీసులను రంగంలోకి దింపనున్నారు. ప్రత్యేక రైళ్లు అవసరమైనప్పుడు అందించాలని, సాధారణ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రైల్వేబోర్డు చైర్మన్ కు లేఖ రాశారు.