: పాక్ నటి సనాఖాన్ ఆకస్మిక మృతి


పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ బుల్లితెర నటి సనాఖాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త బాబర్ ఖాన్ తో కలసి కారులో పాకిస్థాన్ లోని కరాచీ నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా.. అదుపుతప్పి లూనికోట్ వద్ద ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఆ సమయంలో బాబర్ ఖాన్ వాహనాన్ని నడుపుతున్నారు. కారు బోల్తా కొట్టడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని అంబులెన్స్ లో లియాఖత్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే సనా తుదిశ్వాస విడిచారు. గతేడాది డిసెంబర్ లో సనాఖాన్ కు వివాహం అయింది. భర్త భాబర్ ఖాన్ కూడా నటుడే.

  • Loading...

More Telugu News