: డీఎంకేలో అళగిరి తిరుగుబాటు బావుటా !
డీఎంకే (ద్రవిడ మునేట్ర కజగం) అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పార్టీలో వ్యతిరేక బావుటా ఎగురవేశారు. ఈ ఉదయం చెన్నైలో ప్రారంభమైన డీఎంకే కార్యవర్గ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీలో స్టాలిన్ వ్యవహారంపై అళగిరి గుర్రుగా ఉన్నారు. దీనిపై ఇంతకుముందే తండ్రి కరుణానిధి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే గతవారం యూపీఏ నుంచి వైదొలగిన సమయంలో తన రాజీనామాను ఒక్కరే వెళ్లి అళగిరి ప్రధానికి సమర్పించారు. ఈ క్రమంలోనే నేడు సమావేశానికి ఆయన డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తీర్మానం అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.