: ఫవాద్ సెంచరీ... లంక టార్గెట్ 261
ఆసియా కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగులు చేసింది. మలింగ నిప్పులు చెరిగే బౌలింగ్ కు టాపార్డర్ తడబడినా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ఫవాద్ ఆలమ్ (114 నాటౌట్) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఫవాద్... కెప్టెన్ మిస్బా (65), ఉమర్ అక్మల్ (59)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కాగా, పాక్ కోల్పోయిన అన్ని వికెట్లూ మలింగ ఖాతాలోకే చేరడం విశేషం.