: ఉద్యోగానికి రాజీనామా చేసిన శ్రీనివాస్ గౌడ్


తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా చేశానని... హెచ్ వోడీని కలసి రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. కేసీఆర్ కోరిక మేరకే ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు. ఉద్యోగాన్ని వదలి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో మహబూబ్ నగర్ శాసనసభ స్థానానికి పోటీ చేయాలని కేసీఆర్ కోరినట్టు చెప్పారు. ఈ వివరాలను ఆయన ఈ రోజు హైదరాబాదులో మీడియాకు వివరించారు.

  • Loading...

More Telugu News