: రూ.20 వేలు ఉంటే కేజ్రీవాల్ తో డిన్నర్ చేయొచ్చు!
'నిధుల నిమిత్తం విందులు' మనకు కొత్తగానీ, విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నవే. తాజాగా ఆ సంస్కృతిని ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంది. బెంగళూరులో ఈ నెల 15న ఈ తరహా విందు నిర్వహించాలని ఆ పార్టీ వర్గాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారు. ఆయనతో కలిసి భోజనం చేయాలంటే విరాళం రూపేణా రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఐటీ, ప్రైవేట్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్ వర్గాల వ్యక్తులు ఈ విందులో పాల్గొనవచ్చని ఆమ్ ఆద్మీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో 200 మందికి మాత్రమే కేజ్రీవాల్ తో విందులో పాల్గొనే అవకాశముంది. తద్వారా రూ.40 లక్షలు సేకరించాలని ఆ పార్టీ భావిస్తోంది.