: మహిళలతో నేడు మోడీ చాయ్ పే చర్చ
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ నేటి సాయంత్రం మహిళల కోసం ప్రత్యేకంగా చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాలకు సంబంధించిన మహిళలతో మోడీ సంభాషించనున్నారు. మహిళా సాధికారత అంశంపై వారడిగే ప్రశ్నలకు మోడీ బదులివ్వనున్నారు. విదేశాల్లోని మహిళలు సైతం ఇందులో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.