: గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న పంటలకుగాను పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలసిన వారిలో కేంద్ర మంత్రి బలరాం నాయక్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.