: ఒక భార్య ఎమ్మెల్యే.. మరో భార్యకు ఎంపీ టికెట్.. భలే ప్రజాస్వామ్యం!


ఘనత వహించిన భారత ప్రజాస్వామ్యంలో ఒక చిన్న సంగతి తెలుసుకుందాం. బీహార్లోని జిల్లా కేంద్రమైన ఖగారియాలో రణబీర్ యాదవ్ అనే పలుకుబడి కలిగిన వ్యక్తి ఉన్నాడు. 1985లో జరిగిన లక్ష్మీపూర్ మారణహోమంలో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి. నాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సో, ఆయన పేరు చెబితే స్థానికంగా కాస్త హడల్.

రణబీర్ యాదవ్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు పూనందేవి, రెండో భార్య పేరు కృష్ణయాదవ్. పూనందేవి జేడీయూ ఎమ్మెల్యే. ఇప్పుడు రణబీర్ చిన్న భార్య కృష్ణయాదవ్ కు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ తరఫున ఖగారియా లోక్ సభ టికెట్ ఇచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఈమె గెలిస్తే.. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ నేరస్థుడు.. అన్నట్లు వారి కుటుంబం పేరు తెచ్చుకుంటుందన్నమాట. విశేషమేమిటంటే, వీరంతా ఒకే ఇంటిలో కలసి ఉంటున్నారు. ఒకరంటే ఒకరికి మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. ఒకరంటే ఒకరికి ప్రేమ కూడా ఉందట. మన ప్రజాస్వామ్యంలో నేతలు, వారి వారసులు, వారి భార్యలు (పెద్దా, చిన్నా, మధ్య ఎంత మందైనా) ప్రజాప్రతినిధులుగా అవకాశాలను హరిస్తున్నారడానికి ఇదొక ఉదాహరణ!

  • Loading...

More Telugu News