: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు: సుప్రీం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓసారి మద్దతిచ్చిన పార్టీ మరోసారి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆర్ఎమ్ లోథా, ఎన్వీ రమణలతో కూడిన బెంచ్ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ సహకరించిందని, అదే కాంగ్రెస్ పార్టీ జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీని వ్యతిరేకించి బీజేపీతో చేతులు కలిపిన విషయాన్ని బెంచ్ ఈ సందర్భంగా ఉదహరించింది.