: కేజ్రివాల్ కు గుజరాత్ పోలీసుల సెగ


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు గుజరాత్ పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అనుమతి లేకుండా మైక్ లు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేజ్రివాల్ పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి. కేజ్రివాల్ రోడ్ షోలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, గాంధీ ధామ్ లో ఈ ఉదయం సీఎం నరేంద్ర మోడీని కలిసేందుకు వెళ్ళిన కేజ్రివాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు మోడీ అపాయింట్ మెంట్ లభించలేదు.

  • Loading...

More Telugu News