: సికింద్రాబాదులో భారీ వర్షం, రోడ్లు జలమయం
హైదరాబాదు జంటనగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వర్షం కురిసింది. సికింద్రాబాదులో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాదులోని చంపాపేట, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది. సాయంకాల సమయంలో వర్షం కురియడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.