: హైదరాబాదు మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా


హైదరాబాదు మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ రాజీనామా చేశారు. మాజిద్ తన రాజీనామా లేఖను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కు అందించారు. కాంగ్రెస్-ఎంఐఎం పార్టీల మధ్యనున్న ఒప్పందం మేరకు మాజిద్ హుస్సేన్ రాజీనామా చేశారు.

ఒప్పందం ప్రకారం మొదటి రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని, ఎంఐఎం పార్టీ డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాలని, తరువాత రెండేళ్లు మేయర్ పదవిని ఎంఐఎం పార్టీ, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సి ఉంటుంది. అలాగే చివరి సంవత్సరం మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. దీంతో ఒప్పందం ప్రకారమే, ఎంఐఎం అధినేత సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఇంతకు ముందే మాజిద్ హుస్సేన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News