: ఎవరిదయ్యేను ఆసియా కప్?


బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ సమరం తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ రేపు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరగనుంది. కప్ కోసం శ్రీలంక, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లంకేయులు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకున్నారు. ఇక డిఫెండింగ్ చాంప్ పాక్ తన తొలి మ్యాచ్ లో లంక చేతిలో ఓడినా, ఆ తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లపై నెగ్గి టైటిల్ సమరానికి సిద్ధమైంది. శ్రీలంక జట్టులో కుమార సంగక్కర టాప్ ఫామ్ లో ఉండగా, మలింగ, అజంత మెండిస్ బౌలింగ్ లో రాణిస్తున్నారు. పాక్ జట్టు విషయానికొస్తే ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది, ఉమర్ అక్మల్, ఓపెనర్ షెహజాద్, కెప్టెన్ మిస్బాలపైనే ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ లో ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ రాణిస్తే అజేయ లంకకు ముకుతాడు వేయడం కష్టమేమీకాబోదని పాక్ శిబిరం భావిస్తోంది.

  • Loading...

More Telugu News