: మాధవరెడ్డికి చంద్రబాబు నివాళి
మాజీ మంత్రి, టీడీపీ నేత దివంగత మాధవరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా బషీర్ బాగ్ లోని ఆయన విగ్రహం వద్ద తెదేపా అధినేత చంద్రబాబు, మాధవరెడ్డి సతీమణి ఉమామాధవరెడ్డి, పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నాయకుడు మాధవరెడ్డి అని కొనియాడారు. మంచి మిత్రుడైన మాధవరెడ్డి లేకపోవడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు.